RS seat: నడ్డా స్థానం నుంచి ప్రియాంక..?

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) ఇంతవరకు పార్లమెంట్‌ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించలేదు. తాజాగా ఆమె రాజ్యసభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

Published : 30 Jan 2024 19:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీకాలం త్వరలో ముగియనుంది. దాంతో ఖాళీ కానున్న ఆ స్థానం నుంచి సోనియా గాంధీ లేక ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘దీనిపై మేం సోనియా, ప్రియాంకతో చర్చిస్తాం. వారు ఆసక్తి చూపిస్తే.. ఇద్దరిలో ఒకరు ఆ స్థానంలో రాజ్యసభకు వెళ్తారు’ అని ప్రతిభాసింగ్ వెల్లడించారు. ప్రస్తుతం సోనియా.. రాయబరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రియాంక మాత్రం ఇంతవరకు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించలేదు.

రాంచీకి చేరుకున్న సోరెన్‌.. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్‌

2018లో హిమాచల్ ప్రదేశ్‌లో భాజపా అధికారంలో ఉండటంతో.. మెజార్టీ ప్రకారం ఆ రాష్ట్రం నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలతో పూర్తికానుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. 68 స్థానాలకు గానూ 40 సీట్లను దక్కించుకుంది. దాంతో ఇప్పుడు ఆ స్థానం హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లనుంది. మరోపక్క, 56 ఎగువసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నామని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం.. హిమాచల్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని