Nimmala Ramanaidu: తుపాను హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదు: నిమ్మల రామానాయుడు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దెబ్బతిన్న పంటలను తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు.

Updated : 05 Dec 2023 17:05 IST

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దెబ్బతిన్న పంటలను తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించారు. ఓ వైపు జోరువాన కురుస్తున్నా.. తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు చూసి ఆయన చలించిపోయారు. వారితో కలిసి వర్షంలో తడుస్తూనే పొలాల నుంచి నీటిని బయటకు తోడారు. చేతికందిన పంట కోల్పోయామని నిమ్మల ఎదుట పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకే భారీ స్థాయిలో పంట నష్టం సంభవించిందని నిమ్మల ఆరోపించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిమ్మల డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని