Nara Lokesh: అహంకారం నెత్తికెక్కడంతోనే 151 సీట్లు 11 అయ్యాయి: నారా లోకేశ్‌

అహంకారం నెత్తికెక్కి ప్రవర్తించడంతో 151 సీట్లు 11 అయ్యాయని వైకాపా నేతలను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 05 Jun 2024 14:45 IST

అమరావతి: అహంకారం నెత్తికెక్కి ప్రవర్తించడంతోనే 151 సీట్లు 11 అయ్యాయని వైకాపా నేతలను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం.. ప్రతి సమస్యనూ నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కర్నూలులో వలసలు అరికట్టాలి. పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల్లో నీటి ఎద్దడిని నివారించాలి’’ అని లోకేశ్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని