Lokesh: ట్రాక్టర్‌తో తొక్కించి ఆమె ప్రాణాలు తీయడం కలచివేసింది: లోకేశ్‌

మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 02 Mar 2024 09:45 IST

అమరావతి: మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. నీళ్లు పట్టుకోడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను వైకాపా సర్పంచి అనుచరుడు ట్రాక్టరుతో ఢీకొట్టి చంపేసిన ఘటనపై లోకేశ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తాగునీళ్లడిగితే.. ట్రాక్టరుతో తొక్కించి చంపాడు

‘‘ట్యాంకర్‌ వద్దకు వచ్చిన సామినిబాయి(50)ని వైకాపా సైకో చంపేశాడు. ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీయడం కలచివేసింది. నీటి కోసం వచ్చిన మహిళను తెదేపాకు చెందిన వ్యక్తివంటూ బెదిరించారు. నీటితో పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమా? ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. మనం ఉన్నది రాతియుగంలోనా అనే అనుమానం కలుగుతోంది. ఊరంతా చూస్తుండగానే మూడుసార్లు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. కావాలని చేసినప్పటికీ.. డ్రైవింగ్‌ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ఠ కాదా?’’ అని లోకేశ్‌ నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని