కాంగ్రెస్‌కు అచ్చేదిన్‌.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్‌ పోల్స్‌పై సంజయ్‌ రౌత్‌

Congress: కాంగ్రెస్‌కు మంచి రోజులు వచ్చాయని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపు కూటమి విజయంగా అభివర్ణించారు.

Published : 01 Dec 2023 15:48 IST

మంబయి: కాంగ్రెస్‌ పార్టీకి మంచి రోజులు (అచ్చేదిన్‌) వచ్చాయని శివసేన (యూబీటీ), ఇండియా కూటమి నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఈ విషయం చెప్పడానికి ఏ ఎగ్జిట్‌ పోల్‌ అవసరం లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్‌ గురువారంతో ముగిసింది. అనంతరం వెలువడిన పలు సర్వే అంచనాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉండనుందని అంచనా వేశాయి. మిజోరంలో ప్రాంతీయ పార్టీల మధ్యే పోరు ఉండనుందని తెలిపాయి. 

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలడిన నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ గెలుపు అంటే అది ఇండియా కూటమి విజయం. నేను దాన్ని బలంగా నమ్ముతా. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందితే విపక్షాల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరిస్తుంది. దీనిని కూటమి విజయంగా చూడాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే నాయకత్వమే దీనంతటికీ కారణం’’ అని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

కేసీఆర్‌ను గెలిపించడం కోసం జగన్‌ కుట్ర: సీపీఐ నారాయణ

మరోవైపు ప్రియాంక భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌వాద్రా సైతం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై స్పందించారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తాను మరీ అంతగా విశ్వసించనని.. వాస్తవ ఫలితాలనే నమ్ముతానని చెప్పారు. గడిచిన కొన్ని నెలల్లో చాలా మందిని తాను వ్యక్తిగతంగా కలిశానని, అందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని (కమల్‌నాథ్‌ సర్కారును) కూలదోసిన భాజపా పట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారని రాబర్ట్‌ వాద్రా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని