icon icon icon
icon icon icon

CPI Narayana: కేసీఆర్‌ను గెలిపించడం కోసం జగన్‌ కుట్ర: సీపీఐ నారాయణ

తెలంగాణలో పోలింగ్‌ జరుగుతుంటే నీటిని అడ్డంపెట్టుకుని నాగార్జునసాగర్‌ వద్ద జగన్‌ ప్రభుత్వం నాటకమాడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) ఆరోపించారు.

Updated : 01 Dec 2023 12:53 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పోలింగ్‌ జరుగుతుంటే నీటిని అడ్డంపెట్టుకుని నాగార్జునసాగర్‌ వద్ద జగన్‌ ప్రభుత్వం నాటకమాడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) ఆరోపించారు. కేసీఆర్‌ను(KCR) గెలిపించడం కోసం ఆయన కుట్ర పన్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ‘‘ఇన్నాళ్లూ జగన్ (YS Jagan) రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారు. ఆయనకు ఇప్పుడే నీళ్లు ఎందుకు గుర్తొచ్చాయి? జగన్‌ కుటిలయత్నాలు బెడిసికొట్టాయి’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.

YS Jagan: ఇప్పుడే ఎందుకీ దండయాత్ర?

నాగార్జునసాగర్‌(Nagarjuna Sagar Dam) ఆనకట్ట వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఏపీవైపు భారీగా మోహరించిన పోలీసులు.. ముళ్లకంచెల నడుమ డ్యామ్‌పై బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు సాగర్‌ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img