Amit Shah: జూన్‌ 4 తర్వాత ఆయన మాజీ సీఎం: అమిత్ షా వ్యాఖ్యలు

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నవీన్‌ పట్నాయక్‌ మాజీ సీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 28 May 2024 15:27 IST

భద్రక్‌: ఒడిశా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపా అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు. భద్రక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చాంద్‌బలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా పాల్గొని మట్లాడారు. జూన్‌ 4 తర్వాత నవీన్‌ పట్నాయక్‌ మాజీ సీఎం అవుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతీ సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి సీఎంగా రాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైతే యువత ఉపాధి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు.  

ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడు: ప్రధాని మోదీ

ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఒడిశా పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘జూన్‌ 4 వచ్చాక.. నవీన్‌బాబు సీఎంగా ఉండరు. మాజీ సీఎం అవుతారు. భాజపా 17 లోక్‌సభ సీట్లు, 75 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుంది’’ అన్నారు. ప్రస్తుతం తమిళ్‌బాబు (వీకే పాండియన్‌) తెర వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని.. ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేయడం తమను పాలించే అధికారాన్ని ఓ అధికారికి బదులు.. ప్రజా సేవకుడిని ఎన్నుకోవాలన్నారు. ఒడిశా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తున్నారంటూ ప్రశంసించిన అమిత్ షా.. నవీన్‌ పట్నాయక్‌ తన ఫొటో ఉన్న గోనె సంచుల్లో బియ్యాన్ని పంచుతున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని