Pithapuram: పవన్‌ బరిలో లేకపోతే నేనే పోటీ చేస్తా: మాజీ ఎమ్మెల్యే వర్మ

ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) బరిలో నిలకవపోతే తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే, తెదేపా (TDP) నేత ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు.

Published : 20 Mar 2024 14:16 IST

పిఠాపురం: ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) బరిలో నిలకవపోతే తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే, తెదేపా (TDP) నేత ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సుమారు 20 ఏళ్లుగా తెదేపా కోసం పనిచేస్తున్నా. అధినేత చంద్రబాబుకు ఆదేశాలతో పవన్‌ కోసం నా సీటును త్యాగం చేశా. ఎంతో బాధతో ఈ స్థానాన్ని వదులుకున్నా. ఆయన విజయానికి కృషిచేస్తా. పవన్‌ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి నేనే బరిలో ఉంటా’’ అని తెలిపారు.

మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీపై స్పందించారు. ‘‘కేంద్ర పెద్దలు శాసనసభ, లోక్‌సభ స్థానాలు రెండింటిలోనూ పోటీ చేయాలన్నారు. శాసనసభకు పోటీ చేయడమే నాకు ఇష్టం. రాష్ట్రానికి ముందు పని చేసి ఆ తర్వాత దేశం కోసం ఆలోచిస్తా. ఒకవేళ లోక్‌సభకే పోటీ చేయాలని మోదీ, అమిత్‌షా అడిగితే అప్పుడు కాకినాడ స్థానం నుంచి పోటీ చేస్తా. ఆ పరిస్థితుల్లో ఉదయ్‌ శ్రీనివాస్‌ పిఠాపురం నియోజకవర్గానికి వస్తారు’’ అని పవన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని