Priyanka Gandhi భాజపా పెద్ద హామీలు ఇస్తుంది. కానీ, వాటిని నెరవేర్చేందుకు యత్నించదు..

కాంగ్రెస్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ చేసిన అవమానాలకన్నా భాజపా కుంభకోణాల జాబితా చాలా పెద్దదని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న మధ్యప్రదేశ్‌లో ప్రియాంక నేడు పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Published : 12 Jun 2023 15:41 IST

భోపాల్‌: ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఒకటి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ (Congress) నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్థానికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జబల్‌పుర్‌ (Jabalpur)లో సోమవారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. ఉద్యోగ వాగ్దానాల నుంచి కుంభకోణాల వరకు అధికార భాజపా (BJP)పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ (Narendra Modi) చేసిన అవమానాలకన్నా భాజపా కుంభకోణాల జాబితా చాలా పెద్దదని ఆరోపించారు.

‘మధ్యప్రదేశ్‌లో 220 నెలల భాజపా పాలనలో 225 కుంభకోణాలు జరిగాయి. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం గత మూడేళ్లలో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఎన్నికల సమయంలో భాజపా పెద్ద హామీలు ఇస్తుంది. కానీ, వాటిని నెరవేర్చేందుకు యత్నించదు’ అని విమర్శలు చేశారు. ‘అనేక డబుల్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లను చూశాం. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రజలు వాటికి సరైన సమాధానం ఇచ్చారు’ అని ఇటీవల రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. అంతకుముందు ప్రియాంక.. జబల్‌పుర్‌లోని గ్వారీ ఘాట్‌ వద్ద నర్మద నదిలో ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని