Rajasingh: మునావర్ కామెడీ షో అడ్డుకుంటామన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ కామెడీ షోను అడ్డుకుంటామని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ కామెడీ షోను అడ్డుకుంటామని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. రేపు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మునావర్ షోను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే దీనికి పోలీసులు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. మధ్యాహ్నం తర్వాత కామెడీ షోపై పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. దీంతో నగరంలోని రాజాసింగ్ నివాసం వద్దకు పోలీసులు చేరుకొని ఆయనను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను బయటకు రావొద్దని చెప్పినా వినలేదని.. దీంతో ఆయన్ను ఆరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి