Revanth Reddy: చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: సీఎం రేవంత్‌

ఏపీలో కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారానికి తప్పకుండా వెళ్తానని తెలిపారు.

Updated : 05 Jun 2024 15:58 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారానికి తప్పకుండా వెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్నారు. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతామని రేవంత్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని