Lok Sabha Elections: శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్‌నాథ్‌ సింగ్‌

రాజ్యాంగాన్ని మారుస్తుందని భాజపాపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని.. కానీ, కాంగ్రెస్‌ హయాంలో 90 సార్లు ప్రభుత్వాలు కూలిపోయాయని రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు.

Updated : 21 May 2024 18:32 IST

రాంచీ: శత్రువు మెప్పు పొందుతోన్న నేతను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలా? అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) విరుచుకుపడ్డారు. పుల్వామా, ఉరీ దాడుల వెనక పాకిస్థాన్‌ ఉగ్రవాదుల హస్తం ఉందని ఆ దేశ మాజీమంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ గతంలో వెల్లడించారని, ఇప్పుడాయన రాహుల్‌ (Rahul Gandhi)ను ప్రశంసిస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ఝార్ఖండ్‌లోని బొకారోలో నిర్వహించిన ప్రచార సభలో రాజ్‌నాథ్‌ పాల్గొని ప్రసంగించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు.

దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ

‘‘ఫవాద్ హుస్సేన్ ప్రధాని మోదీని పొగడలేదు. కానీ, రాహుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. శత్రువు మన్నన పొందిన ఆ నేతను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలా? అలాంటి వ్యక్తిని గౌరవించాలా? వారు దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు?’’ అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని భాజపాపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని..  కానీ, కాంగ్రెస్‌ హయాంలో 90 సార్లు ప్రభుత్వాలు కూలిపోయాయని ఆరోపించారు. జేఎంఎం పాలనలో ఝార్ఖండ్‌లో అవినీతి తార స్థాయికి చేరుకుందని, మునుపటి సీఎం ప్రమేయం లేకుండా అది సాధ్యం కాదని హేమంత్ సోరెన్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని