TDP: తెదేపా మూడో జాబితా విడుదల

తెదేపా (TDP) అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది.

Updated : 22 Mar 2024 14:24 IST

అమరావతి: తెదేపా (TDP) అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే  128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది. 

ప్రజలంతా ఆశీర్వదించాలి: చంద్రబాబు

తెదేపా మూడో జాబితా విడుదల చేసిన సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీఏలో చేరినట్లు తెలిపారు. పార్లమెంటులో బలమైన గళం వినిపించి రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.

అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు..

  • పలాస-గౌతు శిరీష
  • పాతపట్నం- మామిడి గోవిందరావు
  • శ్రీకాకుళం-గొండు శంకర్‌
  • శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
  • కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
  • అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు
  • పెనమలూరు-బోడె ప్రసాద్‌
  • మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్‌
  • నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు
  • చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌
  • సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

లోక్‌సభ స్థానాల అభ్యర్థులు..

  • శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు
  • విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్
  • అమలాపురం-  గంటి హరీష్
  • ఏలూరు- పుట్టా మహేశ్‌ యాదవ్
  • విజయవాడ- కేశినేని శివనాథ్‌ (చిన్ని)
  • గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
  • నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు
  • బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్
  • నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
  • కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
  • నంద్యాల- బైరెడ్డి శబరి
  • హిందూపురం- బీకే పార్థసారథి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని