Andhra News: తెదేపా అధికారంలోకి వస్తే మొదట పారిపోయేది నానియే: అచ్చెన్నాయుడు

గుడివాడలో గడ్డం గ్యాంగ్‌ అరాచకాలను ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. రావి వెంకటేశ్వరరావును హతమారుస్తామని గడ్డం గ్యాంగ్‌ బహిరంగంగా హెచ్చరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడమే వైకాపా వ్యూహమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 

Published : 26 Dec 2022 01:25 IST

అమరావతి: రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడమే వైకాపా వ్యూహమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గుడివాడలో గడ్డం గ్యాంగ్‌ అరాచకాలను తీవ్రంగా ఖండించారు. రావి వెంకటేశ్వరరావును హతమారుస్తామని గడ్డం గ్యాంగ్‌ బహిరంగంగా హెచ్చరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. గడ్డం గ్యాంగ్‌ను బతిమాలడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను కొట్టినా ఇలాగే బతిమాలుకుంటారా? అని ప్రశ్నించారు. గుడివాడలో తెదేపా నేతలు వంగవీటి రంగా వర్ధంతి నిర్వహిస్తే వైకాపా నేతలకు ఇబ్బందేంటని నిలదీశారు. రంగాను చంపడంలో తప్పులేదన్న గౌతంరెడ్డికి ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవిచ్చిన వ్యక్తి జగన్‌రెడ్డి అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గుడివాడలో ఇద్దరు కాపుసోదరుల మరణానికి నాని కారణమయ్యాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రం నుంచి పారిపోయే మొదటి వ్యక్తి బూతుల నానియేనని ఎద్దేవా చేశారు.

దమ్ముంటే అడ్డుకోండి చూద్దాం: రావి వెంకటేశ్వరరావు

గుడివాడలో రంగా వర్ధంతి జరిపి తీరుతామని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరారవు సవాల్‌ విసిరారు. కొడాలి నాని ప్రోద్భలంతోనే ఆయన గ్యాంగ్‌ గుడివాడలో అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా వర్ధంతి కార్యక్రమాలు చేస్తే నా అంతు చూస్తామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారని, రేపు గుడివాడలో రంగా వర్ధంతి చేసి తీరుతామని, దమ్ముంటే కొడాలి నాని తమను అడ్డుకోవాలని సవాల్‌ చేశారు. పెట్రోల్‌ ప్యాకెట్లు, కత్తులతో తమపై దాడికి వచ్చిన వారిని వదిలేసి, తెదేపా శ్రేణులపై పోలీసులు పదే పదే లాఠీ ఛార్జ్‌ చేయడం దారుణమన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని