TDP: ఆధిక్యంలో చంద్రబాబు సహా పలువురు తెదేపా అభ్యర్థులు

ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. పలు చోట్ల తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Updated : 04 Jun 2024 09:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు చోట్ల తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్‌, పూతలపట్టులో మురళీమోహన్‌ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబుకు 1,594, బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల ఆధిక్యం లభించింది.

జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో జ్యోతుల నెహ్రూ, రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్‌, చిత్తూరులో గురజాల జగన్‌మోహన్‌కు లీడ్‌ వచ్చింది. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, ఒంగోలులో దామచర్ల జనార్దన్‌, గుడివాడలో వెనిగండ్ల రాము, ఉండిలో రఘురామకృష్ణరాజు, గురజాలలో యరపతినేని శ్రీనివాస్‌, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, పెనుకొండలో సవిత, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, విశాఖపట్నం తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు లీడ్‌ వచ్చింది. రెండో రౌండ్‌ ముగిసేసరికి బుచ్చయ్య చౌదరి ఆధిక్యం 2,870కు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని