GV anjaneyulu: జవహర్‌రెడ్డిని సీఎస్‌గా కొనసాగించడం ఎందుకు?: జీవీ ఆంజనేయులు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకు ప్రత్యేకంగా చూస్తోందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

Updated : 27 May 2024 16:05 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకు ప్రత్యేకంగా చూస్తోందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. వివాదాల్లో ఉన్న వ్యక్తిని సీఎస్‌గా ఎందుకు కొనసాగిస్తోందో అర్థం కావడం లేదన్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో మరణాలు చోటు చేసుకున్నప్పుడే ఆయన్ని తొలగించాల్సిందన్నారు. ‘‘ ఏం చేసినా చెల్లుబాటవుతుందనే పరిస్థితికి చేరిన సీఎస్‌ను ఎందుకు ఉపేక్షించాలి? నెలలో రిటైర్మెంట్‌ దృష్ట్యా ప్రభుత్వ ప్రాపకం కోసమే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సీఎం కోసం దేనికైనా సిద్ధమనే రీతిలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. సీఎస్‌పై భూకుంభకోణం ఆరోపణలపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కౌంటింగ్‌ రోజు ఇలాంటి వ్యక్తి చేతుల్లో యంత్రాంగం ఉండటం చాలా ప్రమాదకరం. ఆరోపణల నుంచి రక్షణ పొందేందుకు ఆయన అధికార పార్టీకి కొమ్ముకాసే ముప్పు ఉంది’’ అని ఆంజనేయులు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని