TDP: ‘చలో మాచర్ల’పై పోలీసుల ఆంక్షలు.. తెదేపా నేతల గృహ నిర్బంధం

మాచర్లలో పిన్నెల్లి బాధితుల పరామర్శకు వెళ్లాలని తెదేపా నేతలు నిర్ణయించారు. ఈక్రమంలో ఆ పార్టీ నేతలు చేపట్టిన ‘చలో మాచర్ల’పై పోలీసులు ఆంక్షలు విధించారు.

Updated : 23 May 2024 11:03 IST

అమరావతి: మాచర్లలో పిన్నెల్లి బాధితుల పరామర్శకు వెళ్లాలని తెదేపా నేతలు నిర్ణయించారు. ఈక్రమంలో ఆ పార్టీ నేతలు చేపట్టిన ‘చలో మాచర్ల’పై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ స్పష్టం చేశారు. మాచర్ల వెళ్లకుండా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్‌, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యను గృహ నిర్బంధంలో ఉంచారు. పోలింగ్‌ మరుసటి రోజు నుంచే జూలకంటిని హౌస్‌ అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని