TDP: చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన నేతలు.. అధినేత భరోసా

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో చోటు దక్కని ఆశావహులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు.

Published : 15 Mar 2024 16:12 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో చోటు దక్కని ఆశావహులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. నేతలను పిలిచి మాట్లాడుతున్న ఆయన.. వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను జీవీ ఆంజనేయులు తీసుకొచ్చారు. శ్రీధర్‌ రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పెదకూరపాడులో తెలుగుదేశం విజయానికి కలిసి పనిచేయాలని సూచించారు.

ఎచ్చెర్ల ఇన్‌ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరు రెండో జాబితాలో కూడా లేకపోవడంతో ఆయన వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆయన కూడా అధినేతను కలిశారు. రెండు జాబితాల్లోనూ చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న పెనమలూరు ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్‌ను బుజ్జగించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు.. చంద్రబాబు నివాసానికి వచ్చారు. కాకినాడ అర్బన్ టికెట్ ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానం పొత్తుతో ముడిపడి ఉందని ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని