Chandrababu: అధికారంలోకి వస్తాం.. రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తాం: చంద్రబాబు

కూటమి అభ్యర్థులను గెలిపించండి.. మీ భవిష్యత్తుకు మాది భరోసా అని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Published : 13 Apr 2024 20:24 IST

ప్రత్తిపాడు: ‘కూటమి అభ్యర్థులను గెలిపించండి.. మీ భవిష్యత్తుకు మాది భరోసా’ అని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరులో జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘అమరావతి చుట్టూ ఔటర్‌ రింగ్‌రోడ్డు వేద్దామని అనుకున్నా. తెనాలి, హనుమాన్‌ జంక్షన్‌, సత్తెనపల్లి మీదుగా ఓఆర్‌ఆర్‌ వచ్చేది. 2019 తర్వాత రాష్ట్రంలో భూముల విలువ తగ్గిపోయింది. వచ్చే ఎన్నికలు వన్‌సైడ్‌గా జరుగుతాయి. రాజధాని నిర్మాణం పూర్తయితే ప్రభుత్వ ఆదాయం పెరిగేది. యువతకు లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అమరావతే మన రాజధాని.. దీనికి తిరుగులేదు. ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తాం. 

కృష్ణానది పక్కనున్నా ప్రత్తిపాడులో ఇసుక దొరుకుతుందా? తెదేపా హయాంలో ట్రాక్టరు ఇసుక రూ.వెయ్యి.. ఇప్పుడు రూ.6వేలు. ప్రజల జీవితాల్లో వెలుగులు తేవడం సీఎం బాధ్యత. కానీ,  జగన్‌ బయలుదేరితే చాలు.. ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు. కక్ష తీర్చుకునేందుకే జగన్‌ సీఎం అయినట్టు ఉంది. వైకాపా పాలనలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక ఇనుము, సిమెంట్‌ ధరలు తగ్గిపోతాయి. రైతుల భూములు లాక్కునేందుకు వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారు. భూ పరిరక్షణ చట్టం పేరుతో నాటకాలు ఆడుతున్నారు. వారసత్వంగా వచ్చిన భూమి పట్టాపై జగన్‌ బొమ్మ ఎందుకు?కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. తెచ్చారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని