AP News: ప్రతిపక్షాలను సీఎం అణచివేస్తున్నారు: మండలి బుద్ధ ప్రసాద్‌

కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి చేయడం హేయమైన చర్య అని శాసనసభ మాజీ ఉపసభాపతి

Updated : 28 Jul 2021 10:49 IST

అమరావతి: విజయవాడ సమీపంలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి చేయడం హేయమైన చర్య అని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు. అక్రమాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని వివరించారు. పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ వ్యవస్థపై నమ్మకం లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మఖ్యమంత్రి పోలీస్‌ వ్యవస్థను వాడుకొని ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని