Kharge: ఈ ఎన్నికలు మోదీ Vs రాహుల్ కాదు.. వారి మధ్యే..: ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి, ప్రజలకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే అన్నారు.

Updated : 26 May 2024 16:29 IST

ససరం: ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ‘ముజ్రా డ్యాన్స్‌’ చేస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రధాని బిహార్‌ను అవమానించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత, ‘ఇండియా’ కూటమి అభ్యర్థి మనోజ్‌ కుమార్‌ తరఫున ససరం లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఖర్గే మాట్లాడారు.

గడ్కరీని భాజపా అగ్రనేతలే ఓడించాలనుకున్నారు.. సంజయ్‌ రౌత్‌ సంచలన ఆరోపణలు!

ప్రధాని తనను తాను తీస్‌మార్‌ఖాన్‌ అనుకొంటున్నారని .. ఇది తప్పుడు అభిప్రాయమన్నారు. ప్రజలే తీస్‌మార్‌ఖాన్‌లన్నారు. ప్రధానిని నియంతగా పేర్కొన్న ఖర్గే.. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు ఇక ఏమీ అనడానికి కూడా అనుమతి ఉండదన్నారు. ఈ ఎన్నికలు ప్రధానంగా ప్రజలు వర్సెస్‌ మోదీయే తప్ప రాహుల్‌ వర్సెస్‌ మోదీ కానే కాదన్నారు. నరేంద్ర మోదీని దేశ ప్రధానిగా తాను గౌరవిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్‌ నేతలకు మాత్రం ఆయన గౌరవం ఇవ్వట్లేదన్నారు. ఆయన కేవలం ధనవంతులనే ఆలింగనం చేసుకొంటున్నారు తప్ప పేదల్ని కాదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు