కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది.

Updated : 25 Jul 2023 13:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అప్పటి ప్రత్యర్థి జలగం వెంకట్రావు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. నేడు తీర్పు వెలువరించింది. ప్రస్తుత ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది.   

భారాస అభ్యర్థుల ప్రకటన ఆగస్టులో!

2018లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున వనమా వెంకటేశ్వరరావు, తెరాస (ప్రస్తుతం భారాస) తరఫున జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అభ్యర్థులగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో వనమా విజయం సాధించారు. ఆయన ఎన్నికను సవాల్‌ చేస్తూ 2019లో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం జలగం వెంకట్రావు వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. వనమా ఎన్నిక చెల్లదంటూ నేడు తీర్పు వెలువరించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది. 

ఎన్నికల అనంతరం వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వీడి భారాసలో చేరారు. ప్రస్తుతం జలగం వెంకట్రావు కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని