Published : 01 Jul 2022 01:58 IST

BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: జులై 2, 3 తేదీల్లో జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య నగరంలోని అంబర్‌పేట్‌ నియోజకవర్గంలో గురువారం విస్తృత పర్యటన చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించి భాజపా అధిష్టానం కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ముందుగా అంబర్ పేటకు చేరుకొని విస్తృతంగా పర్యటించారు. మౌర్య పర్యటనల సందర్భంగా నియోజకవర్గంలోని అశోక్ ఫంక్షన్ హాల్‌లో భాజపా యువ మోర్చా, మహిళా మోర్చా సమావేశాలను నిర్వహించారు. బర్కత్‌పురాలోని నగర కార్యాలయంలో అంబర్‌పేట నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, బూత్‌ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నె ఉమా రమేశ్ యాదవ్, బి.పద్మ వెంకట్ రెడ్డి, అమృత, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. బాగ్ అంబర్‌పేట్‌ డివిజన్‌లోని దళిత నాయకుడు అజయ్ కుమార్ ఇంట్లో కేశవ్ ప్రసాద్ మౌర్య భోజనం చేశారు. వారి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆయనకు మంగళహారతులతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని