Uttamkumar reddy: పాలమూరు-రంగారెడ్డి మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు: మంత్రి ఉత్తమ్

జడ్చర్ల: తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు ‘పాలమూరు-రంగారెడ్డి’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. కిష్టారంలోని ఉదండాపూర్ జలాశయం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కూడా భారాస ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు రూ.45 కోట్లు విడుదల చేశామన్నారు. అనంతరం గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను మంత్రులు పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


