Vallabhaneni Vamsi: గన్నవరం వదిలి వెళ్లిన వల్లభనేని వంశీ!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఫలితాలు వైకాపా నేతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

Updated : 04 Jun 2024 18:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఫలితాలు వైకాపా నేతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈక్రమంలో వైకాపా నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ గన్నవరంలో ఘోర ఓటమిని చవిచూశారు. తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు 33 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో వంశీ తన సొంత నియోజకవర్గం గన్నవరం వీడారు. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ బయల్దేరినట్లు సమాచారం. ఇప్పటివరకు వైకాపా కేవలం 8 స్థానాల్లో విజయం సాధించగా.. మరొక స్థానంలోనే ముందంజలో ఉంది. 

ప్రస్తుతం ఎన్డీయే కూటమి 133 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో తెదేపా సొంతంగా 111 స్థానాల్లో గెలవగా.. జనసేన 19, భాజపా 7 సీట్లను కైవసం చేసుకుంది. కూటమి మరో 29 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో ఎన్డీయే కూటమి 160+ సీట్లను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని