Vinod Kumar: రైతుబంధు పథకంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించాలి: వినోద్‌కుమార్‌

ఈ కేబినెట్‌ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్‌కుమార్ కోరారు.

Published : 18 May 2024 13:45 IST

హైదరాబాద్‌: ఈ కేబినెట్‌ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్‌కుమార్ కోరారు. రైతుబంధు పథకం గురించి సమావేశంలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని ప్రధానితో సహా చాలా మంది స్వాగతించారని తెలిపారు. పీఎం కిసాన్‌ పథకానికి స్ఫూర్తి ఇదే అని పేర్కొన్నారు. రోహిణి కార్తె సమయంలో రైతులు పెట్టుబడి కోసం తిరుగుతారని తెలిపారు. కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పంట కోతల తర్వాత రైతుబంధు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఇస్తామన్న రైతు భరోసా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు రూ.15 వేలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వరి పండించిన రైతులకు రూ.500 బోనస్‌ ఇప్పటివరకు అందించలేదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని