Ashok babu: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లన్నీ వైకాపాకు వ్యతిరేకంగానే.. అందుకే కుట్ర: అశోక్‌బాబు

పోస్టల్‌ బ్యాలెట్లలో 90 శాతం ఓట్లు వైకాపాకు వ్యతిరేకంగా పడ్డాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.

Published : 29 May 2024 19:44 IST

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్లలో 90 శాతం ఓట్లు వైకాపాకు వ్యతిరేకంగా పడ్డాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆ ఓట్లను తగ్గించాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించిన డిక్లరేషన్‌పై గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా, బ్యాలెట్ కవర్‌పై ఓటరు సంతకం లేకపోయినా బ్యాలెట్ పేపర్‌ను తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్‌ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైకాపా ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ 750 ఫిర్యాదులు చేస్తే కేవలం రెండింటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కాగితం బయటకు వెళ్లాలన్నా ఒకటికి రెండు సార్లు న్యాయవాదులతో చర్చించి పంపిస్తామని.. అత్యంత బలమైన వ్యవస్థ పని చేస్తోందని వివరించారు. వైకాపా నాయకులపై 400కి పైగా కేసులున్నాయని.. కోర్టులంటే వాళ్లకు లెక్కలేదని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు సైతం వైకాపాకు మొట్టికాయలు వేసిందని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన వైకాపా క్యాన్సర్‌కు మందు జూన్ 4న రానుందని చమత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని