Vaccine: గుర్తింపు పత్రాలు లేకుండా 77 లక్షల మందికి వ్యాక్సిన్లు

దేశంలో 77 లక్షల మంది ప్రజలు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే కరోనా మొదటి డోసు వ్యాక్సిన్‌ను పొందారని,

Updated : 04 Feb 2022 11:10 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం 

దిల్లీ: దేశంలో 77 లక్షల మంది ప్రజలు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే కరోనా మొదటి డోసు వ్యాక్సిన్‌ను పొందారని, 14.55 లక్షల మంది రెండు డోసుల్నీ ఇలాగే తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో వెల్లడించింది. తొలుత సమర్పించిన ప్రమాణపత్రంలో ఇలాంటి వారు 4.82 లక్షల మందే ఉన్నట్లు పేర్కొనడంపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. అది గత ఆగస్టు నెల నాటి లెక్క అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి తెలిపారు. తాజా అంకెలను ప్రమాణపత్రంలో చేర్చాలని ధర్మాసనం సూచించింది.  

సిద్ధూపై కేసు అనూహ్యంగా లిస్ట్‌ అయింది కాదు 

32 ఏళ్ల క్రితం నాటి కేసులో పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌సిద్ధూకు 2018లో విధించిన శిక్షను పునఃసమీక్షించాలంటూ దాఖలైన అభ్యర్థన అనూహ్యంగా లిస్ట్‌ అయిందేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని నాలుగు వారాలు వాయిదా వేయాలని సిద్ధూ తరఫు న్యాయవాది రాసిన లేఖలో ‘ఇది అనూహ్యంగా విచారణలోకి వచ్చింద’ని పేర్కొనడాన్ని జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ల ధర్మాసనం గురువారం ప్రస్తావించింది. రిజిస్ట్రీని ఇలా లక్ష్యం చేసుకోరాదని హితవు పలికింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని