Rohit Sharma: ప్రపంచకప్‌లో మా స్ట్రాటజీ డిఫరెంట్‌గా ఉంటుంది: రోహిత్ శర్మ

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC FINAL 2023) ఓటమితో రోహిత్‌ సేనపై మరోసారి విమర్శలు వచ్చాయి. ఇలాగే ఆడితే వచ్చే వన్డే ప్రపంచకప్‌లోనూ (ODI World Cup 2023) పరాభవం తప్పదనే వ్యాఖ్యలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

Published : 13 Jun 2023 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI WORLD CUP 2023) ముసాయిదా షెడ్యూల్‌ తయారైపోయింది. భారత్‌ వేదికగా జరిగే మెగా టోర్నీ వేదికలు, మ్యాచ్‌ల వివరాలను ఐసీసీకి బీసీసీఐ సమర్పించింది. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయి షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను రోహిత్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా దక్కించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత పదేళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీని గెలవడంలో విఫలం కావడం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లోనూ ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. అయితే, ఇవేవీ ప్రపంచకప్‌లో తమ ప్రదర్శనపై ప్రభావం చూపవని భారత సారథి రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. 

‘‘అక్టోబర్‌లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. మెగా టోర్నీలో విభిన్నమైన ఆటతీరుతో రాణించేందుకు ప్రయత్నిస్తాం. తప్పకుండా అభిమానులను అలరించేందుకు తీవ్రంగా కృషి చేస్తాం. ఈ మ్యాచ్‌ గెలవాలి.. ఆ మ్యాచ్‌లో విజయం సాధించాలని మాత్రమే ఆలోచించం. ప్రతి మ్యాచ్‌ మాకూ చాలా ముఖ్యమని భావిస్తాం. అందుకోసం మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తామనడంలో సందేహం లేదు. మా దృష్టంతా విభిన్నంగా ఆడి కప్‌ను సొంతం చేసుకోవడంపైనే పెడతాం’’ అని రోహిత్ తెలిపాడు. 

భారత్‌ సమస్య అది కాదు: ఆకాశ్‌ చోప్రా

‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్‌లో విఫలం కావడం కాదు. తొలుత బౌలింగ్‌ ఎంచుకుని ప్రత్యర్థికి 469 పరుగులు ఇచ్చారు కదా.. బౌలింగ్‌ వైఫల్యంగా కాకుండా బ్యాటర్లు రాణించలేదని ఎలా చెబుతారని మీరు అడగొచ్చు. ఆసీస్‌ బ్యాటింగ్‌కు దీటుగా భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 400 పరుగులు కూడా చేయలేకయారు’’ అని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు