IND vs SL: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక చిత్తు.. 23 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను టీమ్‌ఇండియా (Team India) 50 పరుగులకే ఆలౌట్ చేసి 23 ఏళ్ల తర్వాత లంకపై ప్రతీకారం తీర్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023ను టీమ్ఇండియా (Team India) సొంతం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంక (Srilanka)ను చిత్తుగా ఓడించి రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక బ్యాటర్లు.. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. మన బౌలర్ల దెబ్బకు లంక 50 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ఇండియా వికెట్ నష్టపోకుండా 6.1 ఓవర్లలోనే ఛేదించింది.
టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో లంకను 50 పరుగులకే ఆలౌట్ చేసి 23 ఏళ్ల పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్, శ్రీలంక మధ్య జరిగింది. షార్జా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 299/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమ్యారు. 54 పరుగులకే ఆలౌటై 245 రన్స్ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఓ వన్డే టోర్నీ ఫైనల్‌లో తక్కువ స్కోరు చేసిన జట్టుగా భారత్ అనవసరపు రికార్డు అందుకుంది. ఇప్పుడు భారత్ అదే శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసి 28 ఏళ్ల తర్వాత ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
మరిన్ని రికార్డులు
- రోహిత్ శర్మ సారథ్యంలో భారత్‌కిది రెండో ఆసియా కప్. 2018లోనూ (బంగ్లాదేశ్‌తో ఫైనల్) హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఆసియా కప్ సాధించింది.
- భారత్‌కు రెండుసార్లు ఆసియా కప్‌లు అందించిన మూడో కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు (అజహరుద్దీన్ 1990, 1995), ధోనీ (2010, 2016) ఈ ఘనత అందుకున్నారు.
- ఆసియా కప్‌లో అత్యల్ప స్కోరు (50) చేసిన జట్టు శ్రీలంక. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ (87.. 2000లో పాకిస్థాన్‌పై) పేరిట ఉండేది.
- వన్డేల్లో భారత్‌పై అత్యల్ప స్కోరు చేసిన జట్టు శ్రీలంక. 2014లో బంగ్లాదేశ్ 58 పరుగులు చేసింది.
- ఈ మ్యాచ్‌లో భారత్ 263 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బంతులపరంగా టీమ్‌ఇండియాకిదే అతిపెద్ద విజయం. అంతకన్నా ముందు 2001లో కెన్యాపై 231 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
- ఓ వన్డే టోర్నీ ఫైనల్‌లో బంతులపరంగా అతిపెద్ద విజయం. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (226 బంతులు ఇంగ్లాండ్‌పై 2003లో) పేరిట ఉండేది.
- వన్డే టోర్నీ ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి మాత్రమే. అంతకుముందు భారత్ (జింబాబ్వేపై 1998లో), ఆస్ట్రేలియా (ఇంగ్లాండ్‌పై 2003లో) ఈ ఘనత సాధించాయి.
- భారత్‌కి ఇది ఎనిమిదో ఆసియా కప్. శ్రీలంక ఆరుసార్లు విజేతగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur : మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
-
OPS: రామ్‌లీలా మైదానం జనసంద్రం.. ఓపీఎస్ పునరుద్ధరణకు కదం తొక్కిన ఉద్యోగులు
-
Hyderabad: భార్య, కుమారుడిని చంపి.. బెయిల్‌పై వచ్చి ఆత్మహత్య
-
Akhilesh : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇంకా టికెట్ రాలేదు.. అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు!
-
Child: మూడేళ్ల చిన్నారికి ‘పేరు’ పెట్టిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..!
-
TSRTC: దసరాకి ఊరెళ్తున్నారా? టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్!