Vaibhav Suryavanshi: ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌.. భారత్‌ ఏ స్క్వాడ్‌ ప్రకటన.. చోటు దక్కించుకున్న వైభవ్‌ సూర్యవంశీ

Eenadu icon
By Sports News Team Published : 04 Nov 2025 11:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖతార్‌ వేదికగా నవంబర్‌ 14 నుంచి ఆసియా కప్‌ రైజింగ్ స్టార్స్‌ (Asia Cup Rising Stars) 2025 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భారత్‌ ఏ జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ఇందులో ఐపీఎల్‌ (IPL) టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చోటు దక్కించుకున్నాడు. అలాగే నేహాల్‌ వధేరా, నమన్‌ ధిర్‌, అశుతోశ్‌ శర్మ, గుర్జప్రీత్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ స్థానం సంపాదించుకున్నారు. జితేశ్‌ శర్మ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను నవంబర్‌ 14న యూఏఈతో ఆడనుంది. అలాగే పాకిస్థాన్‌ ఏతో 16న, ఒమన్‌తో 18న తలపడనుంది. 

ఆసియా కప్‌ రైజింగ్ స్టార్స్‌.. భారత్‌ ఏ స్వ్కాడ్‌ : ప్రియాంశ్ ఆర్య, వైభవ్‌ సూర్యవంశీ, నేహాల్‌ వధేర, నమన్‌ ధిర్‌ (వైస్‌ కెప్టెన్‌), సూర్యాంశ్‌ షెడ్జే, జితేశ్‌ శర్మ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రమణ్‌దీప్‌ సింగ్‌, హర్ష్‌ దూబె, అశుతోశ్‌ శర్మ, యశ్‌ ఠాకూర్‌, గుర్జప్రీత్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, యుధ్వీర్‌ సింగ్‌ చరక్‌, అభిషేక్‌ పోరెల్‌ (వికెట్‌ కీపర్‌), సుయాంశ్‌ శర్మ
స్టాండ్‌ బై: గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌, కుమార్‌ కుశాగ్ర, తనుష్‌ కోటిన్‌, సమీర్‌ రిజ్వీ, షేక్‌ రషీద్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025లో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తరఫున ఆడిన సూర్యవంశీ పేరు మారుమోగిన విషయం తెలిసిందే. అతడు ఫియర్‌ లెస్‌ క్రికెట్‌ ఆడి ఏడు ఇన్నింగ్స్‌ల్లో 252 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సూపర్‌ సెంచరీ, హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. టీమ్ఇండియా అండర్‌-19 జట్టులో వండర్స్‌ చేశాడు. ఇంగ్లాండ్‌పై 52 బంతుల్లోనే రికార్డ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై 86 బంతుల్లో 113 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని