India vs Australia: లెక్క సరిచేస్తారా?
ఆస్ట్రేలియాతో మూడో టీ20 నేడు
మధ్యాహ్నం 1.45 నుంచి 

హోబర్ట్: పొట్టి క్రికెట్ సిరీస్‌లో టీమ్‌ఇండియా పుంజుకోగలదా? సూర్యకుమార్ సేనకు మరో పరీక్ష సిద్ధం. ఆదివారమే ఆస్ట్రేలియాతో మూడో టీ20. బలమైన జట్టు ఉన్నా, రెండో టీ20లో తేలిపోయిన భారత్.. ఈ మ్యాచ్‌లోనైనా కంగారూల పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందా అన్నది చూడాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ గత మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా బౌన్స్, సీమ్ మూమెంట్ ఉన్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డారు. వీళ్లిద్దరు బ్యాట్ ఝళిపించడం జట్టుకు ఎంతో అవసరం. సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె కూడా పరుగుల బాట పట్టాల్సివుంది. అయితే ఆసీస్ ప్రధాన పేసర్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌కు సానుకూలాంశమే. యాషెస్ సిరీస్ నేపథ్యంలో అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్‌లో మిగతా మ్యాచ్‌ల్లోనూ హేజిల్‌వుడ్ ఆడడు. ఇక ఈ మ్యాచ్‌కైనా అర్ష్‌దీప్ సింగ్‌ను భారత జట్టులోకి తీసుకుంటారా అన్నది ఆసక్తికరం. టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్ అయినప్పటికీ అతణ్ని ఆడించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘బుమ్రా ఆడితే జాబితాలో రెండో స్థానంలో అర్ష్‌దీప్ పేరు ఉండాలి. బుమ్రా లేకపోతే అర్ష్‌దీప్ పేరే మొదట ఉండాలి’’ అని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. కుల్‌దీప్ స్థానంలో అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు ఆస్ట్రేలియా ధీమాగా బరిలోకి దిగుతోంది. హేజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్ జట్టులోకి రావొచ్చు. మణికట్టు గాయం నుంచి కోలుకున్న మ్యాక్స్‌వెల్.. ఒవెన్ లేదా షార్ట్ స్థానంలో ఆడతాడు. ఆదివారం మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్‌దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్‌ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్‌కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్.. చెస్ ప్రపంచకప్‌లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


