ఐపీఎల్‌ 2024: చెపాక్‌లో చెన్నై ఛమక్‌.. బెంగళూరుపై విజయం

ఐపీఎల్‌ 2024లో చెన్నై బోణీ చేసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆజట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. 

Updated : 23 Mar 2024 00:24 IST

చెన్నై: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నై (Chennai) జట్టు బోణీ కొట్టింది. బెంగళూరు (Bengaluru)తో జరిగిన మ్యాచ్‌లో ఆజట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్‌ అరంగేట్ర ఆటగాడు రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra) (37: 15 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు), చివర్లో శివమ్‌ దూబే (34*: 27 బంతుల్లో) చెలరేగి ఆడారు. రవీంద్ర జడేజా (25*) అజింక్యా రహానె(27), డారిల్‌ మిచెల్‌(22) విలువైన పరుగులు చేశారు. ఈసారి కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌ (15) నిరాశ పరిచాడు. బెంగళూరు బౌలర్లలో గ్రీన్‌ రెండు వికెట్లు పడగొట్టగా, యశ్‌ దయాల్‌, కర్ణ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (35; 23 బంతుల్లో 8 ఫోర్లు), అనుజ్ రావత్‌ (48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తిక్‌ (38*; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. విరాట్‌ కోహ్లీ (21) పరుగులు చేశాడు. 78 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బెంగళూరును అనుజ్‌, కార్తిక్‌ జోడీ ఆదుకుంది. ఆరో వికెట్‌కు వీరు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని