Chennai X Gujarat: చెపాక్‌లో గుజరాత్‌ చిత్తు.. 63 పరుగుల తేడాతో చెన్నై భారీ విజయం

ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ను చెన్నై జట్టు 63 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.    

Updated : 26 Mar 2024 23:41 IST

చెన్నై: ఐపీఎల్‌ 17వ (IPL) సీజన్‌లో చెన్నై (chennai)కి వరుసగా రెండో విజయం. గుజరాత్‌ (Gujarat)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 63 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత 206 పరుగులు చేసిన చెన్నై.. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్థిని 143 పరుగులకే కట్టడి చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్‌ (37: 31 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌. సాహా (21), మిల్లర్‌ (21) పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపర్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ తలో రెండు వికెట్లు తీయగా, డారిల్ మిచెల్, పతిరన ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

అదరగొట్టిన దూబె, రచిన్‌ రవీంద్ర..

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. శివమ్ దూబె (51; 23 బంతుల్లో 2 సిక్స్‌లు, 5 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (46; 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. రుతురాజ్‌ గైక్వాడ్ (46; 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. డారిల్ మిచెల్ (24), సమీర్‌ రిజ్వి (14), రహానె (12) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని