Mumbai X Chennai: రోహిత్‌ శతకం వృథా.. ముంబయిని సొంత మైదానంలో ఓడించిన చెన్నై

ఐపీఎల్‌ 2024లో హ్యాట్రిక్‌పై కన్నెసిన ముంబయికి చెన్నై షాక్‌ ఇచ్చింది. ముంబయి సొంతమైదానంలో 20 పరుగుల తేడాతో ఓడించింది.  

Updated : 14 Apr 2024 23:51 IST

ముంబయి: హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన ముంబయికి చెన్నై షాక్‌ ఇచ్చింది. వాంఖడే వేదికగా జరిగిన పోరులో ముంబయిని చెన్నై 20 పరుగుల తేడాతో ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (105*; 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. తిలక్ వర్మ (31; 20 బంతుల్లో 5 ఫోర్లు), ఇషాన్‌ కిషన్ (23; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), టిమ్‌ డేవిడ్ (13; 5 బంతుల్లో 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. హార్దిక్‌ పాండ్య (2), రొమారియో షెఫర్డ్ (1) ఘోరంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో పతిరన నాలుగు వికెట్లు పడగొట్టి ముంబయిని దెబ్బతీశాడు. తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానె (5), రచిన్ రవీంద్ర (21) తక్కువ నిరాశపర్చినా.. రుతురాజ్‌ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివమ్‌ దూబె (66*; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలు బాదారు. చివర్లో ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో) హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించాడు. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య 2, శ్రేయస్ గోపాల్, కొయెట్జీ ఒక్కో వికెట్ తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని