టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రేసులో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌.. సీఎస్కే స్పందనిదే

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రేసులో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.

Published : 16 May 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా కొత్త కోచ్‌ వేటలో బీసీసీఐ పడింది. ఆ బాధ్యతల్లో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇకముందు కొనసాగేందుకు ఇష్టం చూపడం లేదు. ఎన్‌సీఏ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు కూడా ఈ రేసులో ఉంది. మరోవైపు విదేశీ కోచ్‌లను నియమించుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ వెల్లడించిన నేపథ్యంలో సీఎస్కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేరు బలంగా వినిపిస్తోంది.

న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ అయిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఐపీఎల్‌లో చెన్నై జట్టు కోచ్‌గా అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి హయాంలోనే సీఎస్కే ఐదుసార్లు ట్రోఫీ గెలిచి ముంబయి రికార్డును సమం చేసింది. టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రేసులో అతడి పేరు వినిపిస్తుండటంపై సీఎస్కే స్పందించింది. అలాంటి ప్రతిపాదనలను చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్‌ కొట్టిపారేశారు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ‘‘అలాంటి వార్తాలు నేను వినలేదు. ఫ్లెమింగ్‌కు, జట్టుకు దీనిపై ఎలాంటి సమాచారం లేదు’’ అని తెలిపాడు.

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా స్టీఫెన్‌ ప్లెమింగ్‌ అర్హతలు, నైపుణ్యాలు సరిగ్గా సరిపోతాయని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కుర్రాళ్లను ప్రోత్సహించి.. వారిలోని ప్రతిభను వెలికితీయడంలో ముందుంటాడని పలువురు అంటున్నారు. సీఎస్కేలో ఎంతోమందిని ఇలాగే పైకి తీసుకువచ్చాడని చెబుతున్నారు. ఫ్లెమింగ్‌తోపాటు.. ఈ రేసులో ఉన్న విదేశీయుల జాబితాలో రికీ పాంటింగ్‌, జస్టిన్‌ లాంగర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు