David Warner: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. అవసరమైతే ఒక్కఫోన్‌కాల్ చేయండి.. వచ్చేస్తా: డేవిడ్ వార్నర్

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆడాలనే ఉత్సాహంతో ఉన్నాడు. తన సేవలు అవసరమని భావిస్తే ఈ సిరీస్‌లో ఆసీస్ తరఫున ఆడేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. బోర్డర్-గావస్కర్‌లో ఆడటం కోసం అంతకంటే ముందు షెఫీల్డ్ షీల్డ్ (ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ)లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచకప్‌తో ఆయా ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.
‘‘నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ఒక్కఫోన్ కాల్ చేయండి చాలు. ఆటపట్ల నేనెప్పుడూ సీరియస్‌గా ఉంటాను. ఫిబ్రవరి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక టెస్టు మ్యాచ్ ఆడారు. నేను కూడా దాదాపు అంతే సన్నద్ధంగా ఉన్నా. ఈ సిరీస్ (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ)కి ఆస్ట్రేలియాకు నేను అవసరమైతే తదుపరి షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడతాను. ఆ టోర్నీలో ఆడితే చాలా సంతోషంగా ఉంటుంది. నేను సరైన కారణాల వల్ల ఆటకు వీడ్కోలు పలికాను. కానీ, అవసరమైతే జట్టు తరఫున ఎల్లప్పుడూ ముందుంటా. ఈ విషయంలో సిగ్గుపడను’’ అని వార్నర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


