David Warner: ఉచిత ఆధార్‌ కోసం వార్నర్‌ పరుగులు.. వీడియో చూశారా..?

Eenadu icon
By Sports News Team Updated : 24 Apr 2024 12:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్ వార్నర్‌ (David Warner)కు భారత్‌ అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలకు రీల్స్‌.. ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోలను అనుకరిస్తూ చేసే ఫన్నీ వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా వార్నర్‌ మరో వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో అతడు ఉచిత ఆధార్‌ తీసుకునేందుకు పరిగెత్తడం నవ్వులు పూయిస్తోంది. అసలేం జరిగిందంటే..

దేశ రాజధానిలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఈ దిల్లీ ఓపెనర్‌తో హోస్ట్‌ కొంతసేపు మాట్లాడాడు. సినిమాకు వెళ్దామని అడగ్గా వార్నర్‌ రాలేనని చెప్పాడు. ఫ్రీ భోజనం అని చెప్పినా కూడా వద్దన్నాడు. చివరకు ‘అక్కడ ఆధార్‌ కార్డు ఉచితంగా ఇస్తున్నారు’ అని చెప్పగానే ‘చలో చలో ’ అంటూ హోస్ట్‌ను ఎత్తుకుని పరిగెత్తడం వీడియోలో కన్పించింది. హోస్ట్‌ అడిగిన ప్రశ్నలకు వార్నర్‌ హిందీలోనే సమాధానం చెప్పడం మరో విశేషం. ఈ ఫన్నీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది.

నేడు దిల్లీ జట్టు గుజరాత్‌తో తలపడనుంది. గాయం కారణంగా వార్నర్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేటి మ్యాచ్‌కూ అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలైన దిల్లీ.. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.


Tags :
Published : 24 Apr 2024 12:21 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు