Lucknow X Delhi: చెలరేగిన ఫ్రేజర్‌, పంత్‌.. 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూపై దిల్లీ విజయం

లఖ్‌నవూపై దిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దిల్లీ ఛేదించింది.   

Updated : 12 Apr 2024 23:31 IST

లఖ్‌నవూ: ఐపీఎల్‌ 2024లో దిల్లీ (Delhi) రెండో విజయం సాధించింది. లఖ్‌నవూ (Lucknow)తో జరిగిన పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేక్‌ ఫ్రేజర్‌ (55: 35 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు), పంత్‌ (41: 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. పృథ్వీ షా (32) విలువైన పరుగులు చేశాడు. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్టబ్స్‌ సిక్స్‌ కొట్టి దిల్లీని విజయతీరాలకు చేర్చాడు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు తీయగా, నవీనుల్‌ హక్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో రెండు ఓటముల తర్వాత దిల్లీ మళ్లీ గెలుపుబాట పట్టింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బదోని (55) అర్ధశతకంతో చెలరేగగా, రాహుల్‌ (39), అర్షద్‌ ఖాన్‌ (20) పరుగులు చేశారు. డికాక్‌ (19), దీపక్‌  (10), పడిక్కల్‌ (3), స్టాయినిస్‌ (8), పూరన్‌ (0) విఫలం కావడంతో లఖ్‌నవూ ఓ మాదిరి స్కోర్‌కే పరిమితం అయింది. దిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని