T20 World Cup: టీ-20 వరల్డ్‌ కప్‌.. క్రీడాభిమానులకు దూరదర్శన్‌ గుడ్‌న్యూస్‌

‘టీ-20 ప్రపంచ కప్‌ (T20 World Cup)’లో భారత్‌ ఆడే మ్యాచ్‌లను ‘డీడీ స్పోర్ట్స్‌ (DD Sports)’ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నట్లు ప్రభుత్వ సంస్థ ‘ప్రసార భారతి’ ప్రకటించింది.

Published : 04 Jun 2024 00:08 IST

దిల్లీ: క్రీడాభిమానులకు భారత ప్రభుత్వ ప్రసార సంస్థ ‘ప్రసారభారతి (Prasar Bharati)’ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ‘టీ-20 ప్రపంచ కప్‌ (T20 World Cup)’లో భారత్‌ ఆడే మ్యాచ్‌లను ‘డీడీ స్పోర్ట్స్‌ (DD Sports)’ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics), వింబుల్డన్‌ పోటీలనూ టెలికాస్ట్‌ చేయనున్నట్లు ‘ప్రసార భారతి’ సీఈవో గౌరవ్ ద్వివేది మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు ఆయా క్రీడా సంస్థలు, ఏజెన్సీలతో చర్చలు తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు. ‘టీ-20 ప్రపంచ కప్’ కోసం రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు.

టోర్నీ చరిత్రలోనే అత్యధికం.. టీ20 వరల్డ్‌కప్‌ విన్నర్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

పారిస్ ఒలింపిక్స్ (జులై 26- ఆగస్టు 11), పారిస్ పారాలింపిక్స్ (ఆగస్టు 28-సెప్టెంబర్ 8) క్రీడాపోటీల లైవ్‌, హైలైట్స్‌ను డీడీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసారభారతి తెలిపింది. జులై 6-14 మధ్య జింబాబ్వేలో భారత్‌ ఆడనున్న ఐదు టీ-20 మ్యాచ్‌లు, జులై 27- ఆగస్టు 7 మధ్య శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ కూడా డీడీ స్పోర్ట్స్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్స్ కూడా టెలికాస్ట్‌ చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. వెస్టిండీస్‌, అమెరికా వేదికగా నిర్వహిస్తోన్న టీ20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా జూన్ 5న న్యూయార్క్‌లో తొలి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో ఆడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు