Ishan Kishan-Shreyas Iyer Row: డబ్బులు సంపాదించండి.. కానీ ఇలా కాదు : మాజీ క్రికెటర్‌

ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై మాజీ ఆటగాడు ప్రవీణ్‌కుమార్‌ స్పందించాడు.

Published : 04 Mar 2024 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల నుంచి తప్పిస్తూ బీసీసీఐ(BCCI) ఇటీవల తీసుకున్న నిర్ణయంపై చర్చ కొనసాగుతూనే ఉంది. యువ ఆటగాళ్లకు ఇదో హెచ్చరిక లాంటిందని పలువురు పేర్కొంటున్నారు. ఈ అంశంపై తాజాగా మాజీ బౌలర్‌ ప్రవీణ్‌కుమార్‌(Praveen Kumar) స్పందించాడు.

క్రికెటర్లు డబ్బు సంపాదించాలని చూడటం సరైందేనని.. అయితే, ఇందుకోసం దేశవాళీ క్రికెట్‌ను పణంగా పెట్టకూడదని ప్రవీణ్‌ సూచించాడు. యువ ఆటగాళ్లు ఐపీఎల్‌ కంటే జాతీయ జట్టుకు ఆడేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరాడు.

బాలీవుడ్‌, పార్టీలు చేసుకోవడం గురించి కాదు.. నా వరకు ఐపీఎల్‌ సీరియస్‌ క్రికెట్‌: గంభీర్

‘‘నేను గత కొంతకాలంగా ఈ విషయం చెబుతూనే ఉన్నాను. డబ్బులు సంపాదించండి.. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? అయితే.. జాతీయ జట్టుకు, డొమెస్టిక్‌ క్రికెట్‌కు దూరంగా మాత్రం ఉండకూడదు. ఐపీఎల్‌కు ముందు ఒక నెల విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత ఆడతాను అంటే.. మానసికంగా మీరు ఆ డబ్బును వదులుకోవడానికి ఇష్టపడకపోవడమే కారణం. ఆటగాడు అన్ని అంశాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకుసాగాలి. ఫ్రాంచైజీ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం తప్పు’’ అని ప్రవీణ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని