LSG vs MI: ఆగేదెవరో? సాగేదెవరో?
వరుసగా రెండు ఓటములతో సీజన్‌ను మొదలెట్టి.. అనంతరం గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్స్ చేరిన ముంబయి ఇండియన్స్ ఒక వైపు! తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో సీజన్‌ను ఆరంభించి..
నేడే ఎలిమినేటర్
ముంబయితో లఖ్‌నవూ ఢీ
ఓడిన జట్టు ఇంటికే
రాత్రి 7.30 నుంచి
వరుసగా రెండు ఓటములతో సీజన్‌ను మొదలెట్టి.. అనంతరం గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్స్ చేరిన ముంబయి ఇండియన్స్ ఒక వైపు! తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో సీజన్‌ను ఆరంభించి.. మధ్యలో తడబడి.. మళ్లీ కుదురుకుని లీగ్ దశ దాటిన లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ మరోవైపు! బుధవారం ఐపీఎల్-16 ఎలిమినేటర్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఓడిన జట్టు ఇంటికే. గెలిచిన జట్టు ఫైనల్లో చోటు కోసం గుజరాత్‌తో రెండో క్వాలిఫయర్‌లో పోటీపడుతుంది.
చెన్నై: ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్ నేడు ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను ఢీ కొడుతుంది. బ్యాటింగ్‌లో ఈ రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్ పరంగా చూస్తే లఖ్‌నవూదే కాస్త పైచేయి. అంతే కాకుండా ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ముంబయితో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ లఖ్‌నవూ గెలిచింది. మరి చెపాక్‌లో ఏ జట్టు విజయకేతనం ఎగరేస్తుందో చూడాలి.
జోరు సాగించాలని..: ఆరో టైటిల్‌పై గురిపెట్టిన ముంబయి జోరు కొనసాగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్‌పై ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఆలస్యంగా పుంజుకున్న సూర్య 14 మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ సహా 511 పరుగులు చేశాడు. ఇషాన్ (439), గ్రీన్ (381) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌పై మెరుపు శతకంతో గ్రీన్ చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ కూడా అర్ధశతకంతో లయ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా (20 వికెట్లు)తో పాటు బెరెన్‌డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్ కీలకంగా మారారు. చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకునే బలహీనతను అధిగమిస్తే ముంబయికి తిరుగుండదు.
గెలుపే లక్ష్యంగా..: నిరుడు అరంగేట్ర సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న లఖ్‌నవూ ఎలిమినేటర్‌లోనే ఆర్సీబీ చేతిలో ఓడింది. ఈ సారి ఆ గండం దాటాలనే లక్ష్యంతో ఉంది. గాయంతో కేఎల్ రాహుల్ దూరమైనప్పటికీ కృనాల్ పాండ్య సారథ్యంలో జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిస్తోంది. యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ (16 వికెట్లు) బౌలింగ్ భారాన్ని మోస్తున్నాడు. అతనితో పాటు అమిత్ మిశ్రా, కృనాల్, నవీన్ ఉల్ హక్, అవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్‌తో కూడిన బౌలింగ్ బలంగానే ఉంది. ఇక బ్యాటింగ్‌లో చూస్తే స్టాయినిస్ (368 పరుగులు), మేయర్స్ (361), పూరన్ (358) జోరు మీదున్నారు. డికాక్ కూడా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ambati Rayudu: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు
-
India News
Rahul Gandhi: రాహుల్‌కు కొత్త పాస్‌పోర్టు జారీ.. అమెరికా పర్యటనకు సిద్ధం
-
Sports News
Gill - Prithvi: తానొక స్టార్ అని భావిస్తాడు.. పృథ్వీ షాపై గిల్ చిన్ననాటి కోచ్ వ్యాఖ్యలు
-
Politics News
Mahanadu: మహానాడు బహిరంగ సభ వద్ద భారీ వర్షం.. తడిసి ముద్దయిన కార్యకర్తలు
-
Movies News
Naresh: ‘మళ్ళీ పెళ్లి’ సక్సెస్.. ‘పవిత్రను జాగ్రత్తగా చూసుకో’ అని ఆయన చివరిగా చెప్పారు: నరేశ్
-
Crime News
Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ఆస్తికోసం తమ్ముడిని చంపిన అన్న