Anuj Rawat : అనుజ్‌ రావత్‌.. భవిష్యత్తు స్టార్‌ అవుతాడు: డుప్లెసిస్‌

టీ20 లీగ్‌లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో..

Published : 11 Apr 2022 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్ అనుజ్‌ రావత్‌ (66) చెలరేగాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రావత్‌కు మంచి భవిష్యత్తు ఉందని  బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘రావత్ ఆడిన విధానం చాలా బాగుంది. భవిష్యత్తులో ఇంకా మంచి ఆటగాడిగా మారతాడు. పిచ్‌ను బట్టి నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు రావత్‌తో మాట్లాడా. తనలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలని మాత్రమే సూచించా’’ అని పేర్కొన్నాడు. 

అనుజ్‌ రావత్‌ గతేడాది రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున టీ20 టోర్నీలోకి అరంగేట్రం చేశాడు. అయితే ఆ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఒక్క ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. ప్రస్తుత సీజన్‌కు వచ్చేసరికి బెంగళూరు తరఫున ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లను ఆడేశాడు. ఓపెనర్‌గా 113 పరుగులు చేశాడు. మెగా వేలంలో అనుజ్‌ రావత్‌ను బెంగళూరు రూ. 3.4 కోట్లకు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని