దూకుడు మంత్రంతో

ఒక్క మ్యాచ్‌.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చూసే దృక్కోణాన్నే మార్చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మామూలుగా ఉండదని చాటిచెప్పింది.

Updated : 31 Mar 2024 09:04 IST

నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ ఢీ

అహ్మదాబాద్‌: ఒక్క మ్యాచ్‌.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చూసే దృక్కోణాన్నే మార్చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మామూలుగా ఉండదని చాటిచెప్పింది. గత మ్యాచ్‌లో ముంబయిపై బ్యాటర్ల వీర విహారంతో 277 పరుగులు చేసి.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా  సన్‌రైజర్స్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే దూకుడుతో గుజరాత్‌ టైటాన్స్‌పైనా చెలరేగేందుకు సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం ఆరంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతోంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో రెండేసి మ్యాచ్‌లాడిన ఈ రెండు జట్లూ.. ఒక్కో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. దుర్భేద్యమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌తో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. హెడ్‌తో పాటు భారత కుర్రాడు అభిషేక్‌ శర్మ, దక్షిణాఫ్రికా ద్వయం క్లాసెన్‌, మార్‌క్రమ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని