ఆర్సీబీ ఇంటికే!

ఐపీఎల్‌- 17వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలవబోతున్నట్లే! 8 మ్యాచ్‌ల్లో ఓ విజయం, 7 ఓటములతో 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఆ జట్టు.. పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.

Updated : 22 Apr 2024 09:27 IST

పీఎల్‌- 17వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలవబోతున్నట్లే! 8 మ్యాచ్‌ల్లో ఓ విజయం, 7 ఓటములతో 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఆ జట్టు.. పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. సాధారణంగా లీగ్‌లో 16 పాయింట్లు (8 విజయాలు) సాధించిన జట్లకు ప్లేఆఫ్స్‌ చేరేందుకు అవకాశముంటుంది. ఒక్కోసారి 14 పాయింట్ల (7 విజయాలు)తోనూ ముందంజ వేయొచ్చు. ఇప్పుడు ఆర్సీబీకి మరో ఆరు మ్యాచ్‌లే మిగిలాయి. ఇందులో గెలిచినా 14 పాయింట్లకే పరిమితమవుతుంది. ఒకవేళ ఆర్సీబీకి అన్నీ కలిసొచ్చి టాప్‌-4లో నిలిచే జట్లలో మిగతా ఒకటో రెండో జట్లు 14 పాయింట్లు సాధించినా.. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ పరిగణలోకి వస్తుంది. ప్రస్తుతం -1.046తో ఉన్న ఆర్సీబీ నెట్‌రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవాలంటే మిగతా మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. అదీ కాకుండా మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాలి. ఇప్పటికే రాజస్థాన్‌ (12), కోల్‌కతా (10), సన్‌రైజర్స్‌ (10) ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. చెన్నై (8), లఖ్‌నవూ (8), గుజరాత్‌ (8) కూడా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ చేరడం కష్టమే. ఏదైనా ఊహించని అద్భుతం జరిగినా ముందంజ వేస్తుందని చెప్పలేం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని