షమి దేశవాళీ బాట

Eenadu icon
By Sports News Desk Published : 20 Jul 2025 02:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కోల్‌కతా: ఎన్నో ఏళ్ల పాటు టీమ్‌ఇండియా ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉన్న మహ్మద్‌ షమి.. ఇప్పుడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. వయసు పెరగడం, ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తడం, ఫామ్‌ కూడా అంత బాగా లేకపోవడమే ఇందుక్కారణం. 2023 వన్డే ప్రపంచకప్‌ తర్వాత గాయం కారణంగా షమి ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. నిరుడు పునరాగమనం చేసినప్పటికీ.. మునుపటిలా సత్తా చాటలేకపోయాడు. దీనికి తోడు ఫిట్‌నెస్‌ సమస్యలు పూర్తిగా సమసిపోకపోవడంతో షమిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. ప్రస్తుత ఇంగ్లాండ్‌ సిరీస్‌కూ అతను జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఘోరంగా విఫలమైన అతను నెల రోజులకు పైగా మైదానంలోకే రాలేదు. ఇప్పుడు తిరిగి దేశవాళీల్లో ఆడబోతున్న షమి.. అక్కడ సత్తా చాటి టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌ కోసం బెంగాల్‌ జట్టు ప్రకటించిన 50 మంది ప్రాబబుల్స్‌లో షమికి చోటు దక్కింది. తాను బెంగాల్‌ జట్టుకు అందుబాటులో ఉంటానని షమి ఇచ్చిన సమాచారం మేరకే అతణ్ని ప్రాబబుల్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం టెస్టు జట్టులో సభ్యులైన ఆకాశ్‌ దీప్, అభిమన్యు ఈశ్వరన్‌ కూడా ఈ ప్రాబబుల్స్‌లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు