దిగ్గజ గోల్‌కీపర్‌ ఫ్రెడరిక్‌ మృతి

Eenadu icon
By Sports News Desk Published : 01 Nov 2025 02:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్‌ మాన్యుయెల్‌ ఫ్రెడరిక్‌ (78) ఇకలేరు. గత 10 నెలలుగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఫ్రెడరిక్‌ శుక్రవారం ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో ఫ్రెడరిక్‌ సభ్యుడు. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. 1947 అక్టోబరు 20న కన్నూర్‌లోని బర్నస్సేరిలో జన్మించిన ఫ్రెడరిక్‌.. కేరళకు మొదటి ఒలింపిక్‌ పతకాన్ని అందించాడు. ఫ్రెడరిక్‌ తర్వాత హాకీలో కేరళ నుంచి పి.ఆర్‌.శ్రీజేష్‌ టోక్యో, పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు గెలుపొందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు