టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు

ఆక్లాండ్: న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు కేన్ విలియమ్సన్ టీ20లకు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున 93 టీ20లు ఆడిన కేన్.. 2575 పరుగులు సాధించాడు. 2011లో జింబాబ్వేపై పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ బ్యాటర్.. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పపువా న్యూగినియాపై ఆఖరి మ్యాచ్ ఆడాడు. టెస్టులు, వన్డేల్లో కొనసాగనున్న 35 ఏళ్ల కేన్.. వచ్చే ఏడాది ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు వ్యూహ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
భారత్-ఎ విజయం
బెంగళూరు: దక్షిణాఫ్రికా-ఎతో నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్-ఎ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 275 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 119/4తో ఆఖరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రిషబ్ పంత్ (90) సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 309...భారత్ 234 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 199 పరుగులకే ఆలౌటైంది.
పాకిస్థాన్‌దే టీ20 సిరీస్
లాహోర్: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో పాక్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది.బాబర్ (68) మెరవడంతో లక్ష్యాన్ని పాక్ 19 ఓవర్లలోనే ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్‌దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్‌ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్‌కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్.. చెస్ ప్రపంచకప్‌లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


