Hardik Pandya: కొన్నిసార్లు 50 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయా: హార్దిక్‌

  త్వరలో జరగనున్న ఐపీఎల్‌-2024 టోర్నీకి ముందు ఓ కార్యక్రమంలో మెరిసిన టీమ్‌ ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Published : 29 Feb 2024 17:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మార్చిలో ఐపీఎల్‌ (IPL 2024) సందడి ప్రారంభం కానుంది. ఈసారి రోహిత్‌శర్మ స్థానంలో ముంబయి జట్టుకు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్‌ తన గురించి ఎన్నో ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు.

‘‘నా గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలను అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నా. ఖాళీ సమయాల్లో నేను పూర్తిగా ఇంట్లో ఉండడానికే ఇష్టపడతా. జిమ్‌, థియేటర్‌ ఇలా అవసరమైన వస్తువులన్నీ ఇంట్లోనే ఏర్పాటుచేసుకున్నా. స్నేహితుల కోసమో లేక పరిస్థితి అనివార్యమైతే తప్ప అడుగు బయటపెట్టను. గత నాలుగేళ్లలో కొన్నిసార్లు మాత్రమే బయటికి వచ్చా. ఒక్కోసారి 50 రోజుల పాటు ఇంట్లోనే ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో కనీసం నా ఇంటి లిఫ్ట్‌ను కూడా చూడలేదు’’ అని హార్దిక్‌ తెలిపాడు.

అలాంటి కామెంట్లకు స్పందించను..

కాంట్రాక్ట్‌లు పోయాయి.. ఇషాన్‌ - శ్రేయస్‌ మళ్లీ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉందా?

ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండేందుకు ఆసక్తి చూపే హార్దిక్‌ పాండ్య ఓ స్టోర్ట్స్‌ కారులో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. దీనిపై అడిగిన ప్రశ్నకు ‘‘మీడియా ముందు ఎలాంటి కామెంట్లు చేయాలనుకోను. అందుకు సమాధానం చెప్పాలని అనుకోను’’ అని బదులిచ్చాడు. సాధారణంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచినప్పుడు ఆటగాడికి దక్కే ప్రైజ్‌మనీ జట్టు మొత్తానికి సమానంగా అందుతుంది. గతంలో నేను కూడా ఈ అవార్డును గెలిచినప్పుడు ఆ డబ్బంతా తనకేనని భ్రమపడ్డాను. ఆ తర్వాత అది జట్టు మొత్తానికి అని తెలిసింది అని నవ్వుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు