Hyderabad vs Mumbai:: హైదరాబాద్‌, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..

ఉప్పల్‌ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. 

Published : 28 Mar 2024 08:20 IST

హైదరాబాద్‌: ఐపీఎల్‌ 2024లో ఉప్పల్‌ వేదికగా సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ (Hyderabad) చెలరేగిపోయింది. ముంబయి (Mumbai)ని 31 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసి కొత్త రికార్డును తన పేరుమీద లిఖించుకుంది. ఇక ముంబయి సైతం దూకుడుగా ఆడింది. 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం, భారీ రన్‌రేట్‌ ఉండడంతో చివర్లో ముంబయి చతికిలపడింది.

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవీ.. 

  • ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టు హైదరాబాద్‌- 277 
  • సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అత్యధిక స్కోర్‌ నమోదు.. ముంబయి - 246
  • ఒక మ్యాచ్‌లో రెండు జట్ల మొత్తం స్కోర్‌ - 523
  • 2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్ల మొత్తం స్కోర్‌ 517 పరుగులు
  • పురుషుల టీ20, ఐపీఎల్‌ టోర్నీలో ఇదే (523) అత్యధిక స్కోర్‌
  • ఐపీఎల్‌లో 2010లో చెన్నై, రాజస్థాన్‌ జట్లు కలిసి 469 పరుగులు చేశాయి. 
  • ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధికంగా నమోదైన సిక్స్‌లు - 38
  • పురుషుల టీ20 టోర్నీలో అత్యధిక నమోదైన సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌ ఇదే- 38
  • ఈ మ్యాచ్‌లో మొత్తం నమోదైన సిక్స్‌లు, ఫోర్లు 69. 2010లో చెన్నై, రాజస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 69 బౌండరీలు ఉన్నాయి.
  • ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లు కొట్టిన సిక్స్‌ల సంఖ్య 20. అంతకుముందు 2013లో బెంగళూరు బ్యాటర్లు 21 సిక్స్‌లు కొట్టారు.
  • తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు 148. గత రికార్డు (2014లో పంజాబ్‌, 2021లో ముంబయి 131 పరుగులు) కనుమరుగైంది.
  • అర్ధశతకం సాధించేందుకు అభిషేక్‌ శర్మ ఆడిన బంతులు 16. సన్‌రైజర్స్‌ తరపున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌ అతనే.
  • ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోపే అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తొలి ద్వయంగా హెడ్‌- అభిషేక్‌ నిలిచారు.
  • ముంబయి పేసర్‌ మపాక సమర్పించుకున్న పరుగులు 66. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నది అతనే.
  • ముంబయి తరపున ఐపీఎల్‌లో రోహిత్‌ ఆడిన మ్యాచ్‌లు 200. ఆ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది అతనే. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు సచిన్‌ 200 నంబరుతో కూడిన ప్రత్యేక జెర్సీ, టోపీ బహుకరించాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని